ఆస్ట్రేలియాతో టీమిండియా ఈరోజు తొలి వన్డేలో తలపడనుంది. ఆసీస్‌లోని పెర్త్ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 223 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఆడనున్నారు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఆస్ట్రేలియాను టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో ఢీకొట్టనుంది.