ప్రకాశం: జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు-1, పామూరు-2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్ – 1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.