ప్రకాశం: తాళ్లూరు మండలంలో శనగ విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 25 శాతం రాయితీతో అందుబాటులో ఉన్నాయని ఏవో ప్రసాద్ రావు తెలిపారు. జె.జి-11, కాక్ 2 రకాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. క్వింటా ధర రూ.7800 కాగా రూ.1950 ప్రభుత్వ రాయితీ ఇస్తుందని అని, మిగిలిన రూ. 5850 చెల్లిస్తే సరిపోతుందన్నారు.