BPT: ఆక్వా రంగం అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్షలో, ఆక్వా సాగుదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆక్వా అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.