NZB: నవీపేట్ మండలం కమలాపూర్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. నాగేపూర్‌కు చెందిన నరేష్ బైక్‌పై నిజామాబాద్ వెళ్తుండగా.. రాజు అనే వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో నరేష్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో NZB జిల్లా ఆస్పత్రికి తరలించారు.