NZB: ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ .. స్థానిక కెనాల్ సమీపంలో లభించింది. దీంతో కెనాల్లో నుంచి దూకి నిందితుడు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.