SS: కదిరి అర్బన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అత్యాచారయత్నం పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి యత్నించగా, బాలిక అక్క గమనించి కేకలు వేసింది. విషయం తెలిసిన తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యులు బాలికను వైద్య పరీక్షలకు తరలించినట్లు తెలిపారు.