భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 152 వన్డేల్లో తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 84 వన్డేల్లో గెలవగా, భారత్ కేవలం 58 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో 10 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 54 మ్యాచ్లలో భారత్ 14, ఆస్ట్రేలియా 38 మ్యాచ్ల్లో గెలిచాయి.