ATP: పది తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ దేవబాబు సూచించారు. వెంకటాపురం క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు తరగతులు నిర్వహించాలన్నారు.