WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం వ్యాపారుల ఆశలు గల్లంతయ్యాయి. రూ.3 లక్షల టెండర్ ఫీజు చెల్లించి శనివారం అర్ధరాత్రి వరకు బారులు తీరి దరఖాస్తులు చేసినా, ప్రభుత్వం ఊహించిన స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా టెండర్లు రాకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల్లో గత ఏడాది కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో టెండర్ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.