KMM: జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ DSP Y. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట, పాల్వంచ, ముత్తగూడెం (ఖమ్మం) చెక్ పోస్ట్లపై తనిఖీలు చేసి, అనధికార నగదును పట్టుకున్నారు. ఈ అనధికార నగదు ఎక్కడిది, ఎవరి నుంచి తీసుకున్నారంటూ చెక్ పోస్ట్ సిబ్బందిని ఏసీబీ డీఎస్పీ ప్రశ్నించి విచారిస్తున్నారు.