అన్నమయ్య: రామసముద్రం MPP కుసుమ కుమారి (70) గుండెపోటుతో బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహకారంతో మండలానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కార్యకర్తలు కొనియాడారు. కాగా, ఆమె భర్త డాక్టర్ సుందరం ఆమెకు సహాయ సహకారాలు అందించి మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.