KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించి, పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ (LRS) దరఖాస్తులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార బోర్డింగ్లు, కోర్టు కేసులు, ప్రభుత్వ స్థలాల డిమార్కేషన్, ప్రకటనల పన్నుల వసూళ్లపై కూడా ఈ సమావేశంలో చర్చించారు