ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత చెన్ నింగ్ యంగ్(103) మృతి చెందారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో ఎంతో కృషి చేశారు. దీంతో తన పరిశోధనలకుగానూ 1957 సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందిన ఆయన, చైనా సంస్కృతిపై మమకారంతో 2015లో దాన్ని వదులుకున్నారు. చెన్ నింగ్ మరణాన్ని చైనా మీడియా నిర్ధారించింది.