KRNL: పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నగర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. కర్నూలు నగర శివారులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.