ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడి సెంటర్లను ఇవాళ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పిల్లల హాజరు పట్టికను పరిశీలించారు. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడి కార్యకర్తకు సూచించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లల శాతాన్నిపెంచాలని వారికి సూచించారు.