ELR: నూజివీడుకి చెందిన దాసరి వెంకటస్వామిని జిల్లా యాదవ సంఘం జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. వెంకటస్వామి నూజివీడు పట్టణంలో టీడీపీ పార్టీలో యువ నాయకునిగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి అన్ని వర్గాలకు చెందిన ప్రజల మన్ననలు తీసుకున్నారు. జిల్లా కార్యదర్శిగా తనని ఎంపిక చేయడం పట్ల వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు.