W.G: నూజివీడు పట్టణంలోని కో ఆపరేటివ్ డివిజనల్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. డివిజనల్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ మరీదు రవికుమార్ మాట్లాడుతూ.. పిచ్చి మొక్కలు చెత్త వ్యర్ధాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఈవో నీలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.