BHPL: జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు టెండర్లకు నేటితో గడువు ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలోని 59 షాపులకు 525 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ SP శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. గతంలో 59 షాపులకు 2,161 దరఖాస్తులు రాగా, రూ. 43.22 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు 525 దరఖాస్తులకు రూ. 15.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.