NZB: జిల్లా వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెంచారని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంచారని పాత మూడు సీట్లతో కలిపి ఇప్పుడు మొత్తం ఏడు పీజీ సీట్లు అయ్యాయన్నారు. డెర్మటాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయన్నారు.