GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడు, పెదకాకాని, అగతవరప్పాడు గ్రామాలకు చెందిన 11 మంది అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 6,49,278 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలందరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.