KDP: గోపవరం మండలం వడ్డే అగ్రహారానికి చెందిన వేముల రమణయ్య కుమారుడు వేముల వెంకటేష్ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలు నియోజకవర్గ TDP సమన్వయకర్త రితేష్ రెడ్డి శనివారం వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వెంకటేష్ మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.