E.G: కొవ్వూరులో శ్రీ రామా సొసైటీ వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం ప్రారంభించారు. కొవ్వూరు పరిసర ప్రాంత వాసులకు నాణ్యమైన బాణసంచాను సొసైటీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోఏఎంసీ చైర్మన్ శ్రీరామ్, రామకృష్ణ పాల్గొన్నారు.