TG: గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ గత పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ‘ BRS పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారు. అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా చేయాలనే రీతిలో పాలన సాగింది. మీ గురించి వారు ఆలోచించి ఉంటే 8 ఏళ్ల క్రితమే మీకు ఉద్యోగాలు వచ్చేవి’ అని CM అన్నారు.