ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బాణాసంచా షాపుల మధ్య దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రమాద జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట సీఐ, పోలీసులు ఉన్నారు.