GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన పార్టీ విద్యార్ధి విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సభలో, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చ జరిగింది.