AP: ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ముగిసింది. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించారు. ఉద్యోగుల అభిప్రాయాలు, విజ్ఞప్తులను కేబినెట్ సబ్‌కమిటీ మంత్రులు త్వరలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీనిపై చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.