AP: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మవద్దని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు భక్తులను కోరారు. టీటీడీ అధికారులుగా నమ్మించి మధ్యవర్తులు దర్శనం, సేవలు కల్పిస్తామని ప్రలోభపెడుతూ, డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. నకిలీ వ్యక్తులను గుర్తించి ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.