MDK: మెదక్ జిల్లా అధికారులు, డీడీవోలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/ గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.