PPM: కురుపాం వసతి గృహంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దసరా సెలవు నుండి వచ్చిన తర్వాత అన్ని వసతి గృహాల్లో స్క్రీనింగ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వణుకుతున్న వసతి గృహాలు అనే శీర్షికకు శనివారం ఆయన స్పందించారు.