ADB: ఆది కర్మయోగి, దత్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని పీవో కుష్బూ గుప్తా తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 17న నిర్వహించిన జాతీయ సదస్సులో జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.