KNR: హుజురాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల ఐటీఐ విద్యార్థి మోరే ఋషి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంటలో ఐటీఐ సెకండియర్ చదువుతున్న ఋషి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.