W.G: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుండా జగన్ను, ఆయన పార్టీని వెయ్యి అడుగుల గోతిలో పాతిపెడతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ పాలకొల్లులో జరిగిన ఏఎంసీ ప్రమాణస్వీకార సభలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. జగన్ మళ్లీ గెలిస్తే తమకేమి నష్టం లేదని తెలిపారు.