VZM: ఈనెల 20వ తేదీన సోమవారం దీపావళి పండగ సందర్బంగా కలెక్టరెట్లో జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈ వారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి వ్యయ ప్రయాసలకు ఓర్చి కలెక్టరెట్కు రావద్దని సూచించారు.