HYD: నగరంలో ఇంటి అద్దెలు రోజురోజుకూ పెరిగి, తారా స్థాయికి చేరుతున్నాయి. ఐటీ పరిశ్రమ కారణంగా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు రూ.40వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అద్దెలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఉప్పల్, ఎల్బీనగర్, బోడుప్పల్ వంటి శివారు ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు.