కృష్ణా: ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 55 మంది లబ్ధిదారులకు రూ.16,00,258లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి 682 మందికి రూ.5,05,34,621 సహాయం అందచేశామన్నారు.