TG: బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ముగియడంతో RTC బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ఉదయం నుంచి డిపోల వద్ద బీసీ సంఘాల నిరసనల కారణంగా బస్సులు బయటకు రాలేక, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ ప్రభావం తగ్గడంతో HYDలో ఎలక్ట్రిక్ బస్సులు, జిల్లాల్లో పరిమిత సంఖ్యలో బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.