VZM: దీపావళి పండుగ వెలుగుల పండుగగా, చెడుపై మేలును ప్రతిబింబించే మహోత్సవంగా మన దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలన్నారు.