ELR: 2వ పట్టణ పరిధిలో విమలాదేవి పాఠశాల వద్ద ఇంట్లో భారీగా బాణాసంచా నిల్వలు ఉన్నట్లు శనివారం టూ టౌన్ పోలీసులు సమాచారం అందుకున్నారు. ఇంటిపై పోలీసులు దాడి చేసి వారి వద్దనున్న బాణాసంచా స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా బాణాసంచా నిలువ ఉంచిన అమ్మకాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రావణ్ అన్నారు.