KNR: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పనితీరు మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.