CTR: బైరెడ్డిపల్లి మండల పరిధిలోని కైగల్ జలపాతాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా దీనిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అక్కడికి వచ్చిన పర్యాటకులతో చర్చించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంత మేర భూమి అందుబాటులో ఉందో రెవిన్యూ అధికారులను ఆరా తీశారు.