NTR: తిరువూరులో జరిగిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రం జీఎస్టీ ధరలను తగ్గించడంతో సోలార్ వినియోగం పెరుగుతుందని అన్నారు. ఇంకుడు గుంతలను పరిశీలించి, చెత్త నుంచి సంపద సృష్టించడం, పరిశుభ్రత ప్రాముఖ్యతను కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు.