AP: ధర్తి ఆబా జనభాగీధారి అభియాన్లో భాగంగా అల్లూరి జిల్లాకు ఉత్తమ జిల్లాగా జాతీయ పురస్కారం లభించింది. పీఎం జేజీయూఏ, పీఎం జన్మన్ను సమర్థంగా అమలు చేసినందుకు పురస్కారం అందుకోనుంది. అయితే అల్లూరి జిల్లాకు జాతీయపురస్కారం రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.