VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి శనివారం సారిపల్లి గ్రామంలో ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు ఆమె గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి వారి బాగోగులు విచారించారు. అనంతరం అక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పీఏఎఫ్ ప్యాకేజీ, రహదారి, ఉపాధి పనుల కొరత సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.