MLG: ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని పస్రా సీఐ దయాకర్ హెచ్చరించారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి, ఫోన్లో మాట్లాడుతూ.. అతివేగంగా వాహనాలు నడిపితే చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరమని తెలిపారు.