TPT: ఏర్పేడు- వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ మార్గం ద్వారా దూరప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.