కోనసీమ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. శనివారం ఆత్రేయపురం మండలం లొల్లలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయల జగన్నాథంతో కలిసి గ్రామంలో సైకిల్ తొక్కుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.