KRNL: ఆలూరు మండలం మొలగవెల్లిలో నూతన పాఠశాల భవనాన్ని వైకుంఠం జ్యోతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి భోజనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించిన ఆమె, ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.