BDK: ప్రభుత్వం కేటాయించిన నిధులు ప్రజల ప్రయోజనానికి వినియోగించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ములకలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పంచాయతీరాజ్ పనులపై గండుగులపల్లిలో సమీక్ష సమావేశాన్ని శనివారం ఎమ్మెల్యే నిర్వహించారు. రహదారులు, తాగునీటి పథకాలు, డ్రైనేజీ, గ్రామీణ అభివృద్ధి పనులపై వారు సమీక్షించారు. డీఈ సైదులు రెడ్డి, ఏఈలు శ్రీనివాస్ పాల్గొన్నారు.