NRPT: బీసీ బంద్ భాగంగా శనివారం తెల్లవారుజామున బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు నారాయణపేట ఆర్టీసీ బస్ డిపో ముందు శనివారం నిరసన తెలిపారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సాయిబాబా పాల్గొనారు.